ఇండియాలో తక్కువగానే, విదేశాల్లో రకరకాల జంతువులను తమ ఇళ్లల్లో పెంచుకుంటూ వుంటారు.ఇక్కడ కేవలం కుక్కలనే తమ పెంపుడు జంతువుగా స్వీకరిస్తారు.
కానీ ఫారిన్లో మాత్రం కుక్కలతో పాటుగా పిల్లుల్ని, ఎలుకల్ని, పాముల్ని, పులుల్ని, సింహాలను ఇంకా అనేక రకాల జంతువులను పెంచడం పరిపాటి.ఇంకొంతమంది వెరైటీగా తాబేలుని కూడా పెంచుతూ వుంటారు.
ఇపుడు మాట్లాడుకోబోయేది అలాంటి ఓ తాబేలు ఇంటి గాథే.ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న జంతువులు ఒక్కోసారి మిస్ అయినపుడు ఆ బాధ వర్ణనాతీతం.
సరిగ్గా అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది.
వివరాల్లోకి వెళితే, ఓ బ్రెజిల్ ఫ్యామిలీ ఎంతో ప్రేమగా పెంచుకున్న తాబేలు ఒకరోజు హఠాత్తుగా కనబడటం మానేసింది.
దాంతో ఆ ఇంటిల్లిపాది తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.అయితే తప్పిపోయిన తాబేలు 30 సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించింది.ఇక అసలు విషయం చూస్తే, ‘మాన్యులా’ పేరు గల ఈ పెంపుడు తాబేలు రియోడి జెనీరోకు చెందిన కుటుంబ నుంచి 1982లో అదృశ్యమైంది.ఎంత వెతికినా కనిపించకపోగా.
ఇంట్లో విద్యుత్ పనులు జరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని కుటుంబీకులు భావించారు.వెతికి వెతికి తరువాత కొన్నాళ్ళకు మర్చిపోయారు.
ఈ క్రమంలో చనిపోయి ఉంటుందని అనుకున్నారు.అయితే 30 ఏళ్ల తర్వాత ఆ కుటుంబ పెద్ద లియోనెల్ చనిపోయినపుడు ఇంటిని శుభ్రంచేసే క్రమంలో అటకపై చెత్తను క్లీన్ చేస్తున్నపుడు ఆ తాబేలు కనిపించింది.
దీంతో ఒక్కసారిగా వారు ఖంగుతిన్నారు.అసలు అది ఇన్నేళ్లు ఎలా బతికిందోనని వారు ఆశ్చర్యపోయారు.అంతేకాదు దాన్ని మగ తాబేలుగా గుర్తించి.మాన్యులా బదులు మాన్యువల్‌గా పేరు మార్చారు.
ఇకపోతే తాబేళ్లు దాదాపు 250 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలవు అనే సంగతి మనం చదువుకున్నాం.