సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల విషయంలో ప్రేమలు బ్రేకప్ సర్వసాధారణం.ఈ విధంగా ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమలో పడి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకొని అనంతరం ఇతరులతో వారి జీవితాన్ని పంచుకున్న వారు చాలా మంది ఉన్నారు.
ఇలాంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఈమె కెరియర్ అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో ప్రేమలో పడి తన కెరీర్ ను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో శృతిహాసన్ తనతో బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇకపోతే అనంతరం ఈమె ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతన హజారికా అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు.
ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో నివసిస్తూ ఉన్నారు.ఇక నిత్యం వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదు.
ఇక గత కొద్ది రోజుల క్రితం పెళ్లి గురించి శృతిహాసన్ అని ప్రశ్నించగా తనకు పెళ్ళంటే ఆందోళనకరంగా ఉంది అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.
తాజాగా మరోసారి ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సుదీర్ఘంగా ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితానికి అలాగే వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ప్రపంచంలో మీరు అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ కెమెరాను పక్కనే ఉన్న తన ప్రియుడి వైపు చూపిస్తూ తానే తన సర్వస్వం అని ఈ సందర్భంగా శ్రుతిహాసన్ తన ప్రియుడు గురించి తెలియజేశారు.
ఇకపోతే శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు.