త‌ర‌చూ క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా? అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంద‌రు త‌ర‌చూ క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

ఫైబ‌ర్ ఫుడ్ అధికంగా తీసుకోవ‌డం, పేగుల్లో వాపు, మ‌ల‌బ‌ద్ధ‌కం, మ‌ద్యపానం, ధూమ‌పానం, ఫాస్ట్ ఫుడ్స్ ఓవ‌ర్‌గా తిన‌డం, నీటిని స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రంగా మారుతూ ఉంటుంది.దాంతో ఈ స‌మ‌స్యను ఎలా నివారించుకోవాలో అర్థంగాక తెగ మ‌ద‌న ప‌డితోనూ ఉంటారు.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.ఈ క‌డుపు ఉబ్బ‌రాన్ని సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.క‌డుపు ఉబ్బరాన్ని త‌గ్గించ‌డంలో నిమ్మ ర‌సం అద్భుతంగా సహాయ‌ప‌డుతుంది.

Advertisement
Home Remedies To Get Rid Of Bloated Stomach! Home Remedies, Bloated Stomach, Sto

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో ఒక స్పూన్ నిమ్మ ర‌సం యాడ్ చేసి సేవించాలి.ఇలా చేస్తే కొన్ని నిమిషాల్లో ఉప‌శ‌మ‌నం పొందుతారు.

కొబ్బరి నూనె కూడా క‌డుపు ఉబ్బ‌రాన్ని త‌గ్గించ‌గ‌ల‌దు.వంట‌ల‌కు వాడే కొబ్బ‌రి నూనెను ఒక స్పూన్ చ‌ప్పున సేవించాలి.

ఇలా చేస్తే కొబ్బ‌రి నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ ల‌క్ష‌ణాలు క‌డుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి.క‌డుపు ఉబ్బరం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే.

గుప్పెడు తుల‌సి ఆకుల‌ను తీసుకుని నీటిలో వేసి బాగా మ‌రిగించాలి.

Home Remedies To Get Rid Of Bloated Stomach Home Remedies, Bloated Stomach, Sto
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇప్పుడు నీటిని వ‌డ‌బోసుకుని.తేనె క‌లిపి సేవించాలి.ఇలా చేసినా వెంట‌నే రిలీఫ్ పొందుతారు.బేకింగ్ సోడా సైతం క‌డుపు ఉబ్బరానికి చెక్ పెట్ట‌గ‌ల‌దు.

Advertisement

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి తాగాలి.త‌ద్వారా క‌డుపు ఉబ్బ‌రం ప‌రార్ అవుతుంది.అలాగే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తోనూ క‌డుపు ఉబ్బరాన్ని నివారించుకోవ‌చ్చు.

ఒక గ్లాస్ హాట్ వాట‌ర్ లో ఒక స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసి తీసుకుంటే మంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

తాజా వార్తలు