ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో శనివారం చివరి రోజు ప్రజా పాలన కేంద్రంలో దరఖాస్తు ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో అధికారులు గ్రామాలలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే పేరుతో అనేక సమస్యలను సర్వేలు చేసి ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలా నిర్లక్ష్యం వహించకుండా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

The Government Should Immediately Implement The Six Guarantees , Six Guarantees,

ఎలాంటి తారతమ్య విభేదాలు లేకుండా ప్రజలందరికీ ప్రజా పథకాలు అందే విధంగా చూడాలని అన్నారు.ప్రజా పాలన పేరుతో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు యారమాద శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News