దుమ్ము లేపిన మందు బాబులు...మూడు రోజుల్లో రూ.658 కోట్ల మద్యం తాగేసిండ్రు...!

నల్లగొండ జిల్లా:న్యూ ఇయర్ వేడుకలంటే( New Year celebration ) ముందుగా గుర్తొచ్చేది మందు.అవును తెలంగాణలో ఏ పండుగ జరిగినా లిక్కర్ ఉండాల్సిందే.

ఇక డిసెంబర్ 31 అంటే ఎంజాయ్ మామాలుగా ఉండదు.మందు సుక్కతో పాటు చికెన్,మటన్ ముక్క ఉండాల్సిందే.

ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచి వైన్స్ ల వద్ద రద్దీ కనిపించింది.ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

బీర్లు తోపాటు హర్డ్ కూడా భారీగా విక్రయించారు.తెలంగాణలో డిసెంబర్ 31న లిక్కర్ సేల్స్ పెరిగాయి.

Advertisement

మద్యం డిపోలను ఓపెన్‌‌లో పెట్టి మరీ లిక్కర్,బీర్లను వైన్ షాపులకు పంపారు.ఈ నెల 29,30,31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్,బీర్లు అమ్ముడుపోయాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.ముందే ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్బుల్లోనూ లిక్కర్ భారీగా తరలించారు.

డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి.రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో లిక్కర్ సెల్స్( Liquor sales ) భారీగా పెరిగాయి.

మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది.మూడు రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేస్​లు, 6.31 లక్షల బీర్ కేస్​లు అమ్ముడయినట్లు తెలుస్తోంది.ఇందులో ఒక్క 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ సేల్ అయింది.ఇక డిసెంబర్ 31న భారీగా సెల్స్ జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

లిక్కర్ తో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి.అలాగే చికెన్,మటన్,చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
ఈ రెండు ఉంటే చాలు ఎంత పల్చటి జుట్టునైనా ఒత్తుగా మార్చుకోవచ్చు!

హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి.సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్​విక్రయించగా,ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడు పోయింది.ప్రస్తుతం చికెన్​అమ్మకాలకు మంచి వాతావరణం ఉందని, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

చికెన్ ధరలు భాగానే ఉన్నాయి.

Latest Nalgonda News