డాక్టర్ నిర్లక్ష్యం శిశువు మృతి?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో గల శివసాయి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది.

శిశువుకి మృతికి హాస్పిటల్ వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన చిర్ర నాగమణిని పురిటి నొప్పులతో డెలివరీ నిమిత్తం గురువారం ఉదయం 10 గంటలకు శివసాయి హాస్పిటల్ కి తీసుకొచ్చారు.ఆమెను పరీక్షించిన డాక్టర్ నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పి,సాయంత్రం వరకు పేషంట్ ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

శిశువు మృతికి కారణమైన డాక్టర్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

Advertisement

Latest Suryapet News