తెలుగుదేశం పార్టీ హయాంలొనే అన్ని వర్గాల అభివృద్ధి

ఇంటింటికి తెలుగుదేశం,సభ్యత్వ నమోదు కార్యక్రమం.సిరిసిల్ల నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు వీర్నపల్లి :తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు శనివారం సిరిసిల్ల నియోజకవర్గం వీర్నపల్లి మండలంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల కో ఆర్డినేటర్ పర్మాల మల్లేశం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోనే అన్ని వర్గాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు.

బడుగు,బలహీన వర్గాలు ఆర్థికంగా,రాజకీయంగా పురోగతి సాధించింది తెలుగుదేశం పార్టీ వలనే అని ఆయన అన్నారు.కూడు, గూడు నీడ అనే నినాదంతో స్థాపించినా పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పార్టీ పునర్నిర్మాణం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్,రాష్ట్ర నాయకులు సూర్యనాయక్, టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,దేవయ్య,చిన్న కాశిరాం,కృష్ణ,మహేందర్ గౌడ్,ప్రకాష్,రత్నయ్య,లచ్చయ్య,అమృ,లింగం,దేవయ్య,నారాయణ తదితరులు .

వ్యూహం అదిరింది బాబాయ్ .. ! 
Advertisement

Latest Rajanna Sircilla News