కృష్ణవంశీ సినిమాలు అంటే అందరికీ చాలా ఇష్టం ముఖ్యం గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పనికట్టుకుని మరి ఆయన సినిమాలు చూస్తారు.ఎందుకంటే కృష్ణవంశీ సినిమాల్లో ఫ్యామిలీ కి సంభందించిన ఎమోషన్స్ హైలెట్ గా నిలుస్తాయి కాబట్టే ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు ఉంది.
అయితే ఆయన తరుణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా చేసిన శశిరేఖ పరిణయం సినిమా కోసం మొదటగా నాగరాజు ఉండ్రమట్ల అనే ఒక రైటర్ ను డైలాగ్ రైటర్ గా తీసుకున్నారట అయితే నాగరాజు గారు ఈ సినిమాకి డైలాగ్స్ బాగా రాసిన కూడా కృష్ణవంశీ ఆస్థాన రైటర్ అయిన ఓ వ్యక్తి కి ఆ డైలాగ్స్ చూపించి మళ్ళీ ఆయనతో కూడా రాయించేవాడట దాంతో విసిగి పోయిన నాగరాజు గారు నేను ఒక్కడిని అయితేనే ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తాను.
లేకపోతే నేను రాయలేను అని గట్టిగా కృష్ణవంశీ గారికి చెప్పారట అప్పుడు ఆయన సరే మీరు ఒక్కరే రాయండి అని చెప్పరట దాంతో నాగరాజు గారు మళ్లీ ఒక సీన్ కి డైలాగ్స్ రాసి కృష్ణవంశీ కి చూపిస్తే నాగరాజు గారికి తెలీకుండా కృష్ణ వంశీ ఆయన ఫ్రెండ్ తో కూడా రాయించే వాడట ఇలా సినిమా మొత్తానికి వాళ్లిద్దరూ డైలాగ్స్ రాసారట సరే వీళ్లతో నాకు గొడవ ఎందుకు అని నాగరాజు గారు వర్క్ చేసుకుంటూ ముందుకు వెల్లేవారట అయితే సినిమా మొత్తం పూర్తి అయి రిలీజ్ కి రెడీ అయిన నేపద్యం లో డైలాగ్ రైటర్ అనే టైటిల్ లో నాగరాజు గారి పేరు వేస్తూనే కృష్ణ వంశీ ఫ్రెండ్ అయిన అతని పేరు కూడా వేశారట అయితే ఈ విషయం లో తీవ్రంగా హర్ట్ అయ్యారు అంట నాగరాజు గారు దాంతో ఇక ఆయన సినిమాలో రైటర్ గా పని చేయడం శుద్ధ దండగ అని అనుకున్నారట.ఇక కృష్ణ వంశీ నాగరాజు తో చెప్పినట్లు గానే ఆ ఇద్దరు పేర్లు టైటిల్స్ లో ఆడ్ చేశారట…