కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, యావత్ భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో వన్ అఫ్ ది బెస్ట్ కమీడియన్ బ్రహ్మానందం.ఈ విషయంలో సందేహమే లేదు.ఆయన పేరు చెప్తేనే ప్రేక్షకుల ముఖాలలో చిరునవ్వు మొదలవుతుంది.1987 లో మొదలైన బ్రహ్మానందం( Brahmanandam ) గారి సినీ ప్రస్థానం, మూడు దశాబ్దాల పాటు దిగ్విజయంగా సాగింది.ఇంకా సాగుతూనే ఉంది.ఇప్పటివరకు 1000 కి పైగా చిత్రాలలో నటించిన బ్రహ్మానందం, తన నటనతో, హాస్యం తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలలో నటించడం తగ్గించినా, యూట్యూబ్, మీమ్స్ అంటూ ఏదో ఒక రూపంలో ప్రతిరోజు మన కళ్ళముందు ప్రత్యక్షమవుతూనే ఉంటారు.తెలుగు పరిశ్రమలో మాత్రమే కాకుండా, పలు తమిళ చిత్రాలతో కూడా నటించారు బ్రహ్మానందం.
ఐతే చాలా ఏళ్ళ తరువాత మళ్ళి ఒక తమిళ చిత్రం లో నటించారు.ఈ చిత్రం తాజాగా ఓటిటి లో విడుదలయింది.
ఐతే ఓటిటి లో విడుదలైన ఈ చిత్రాన్ని, తెగ ట్రోల్ చేస్తున్నారు తమిళ ప్రేక్షకులు.తమిళ పరిశ్రమలో టాప్ కమీడియన్ సంతానం హీరోగా నటించిన చిత్రం “కిక్( kick movie )”.ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం.తాన్యా హోప్, రాగిణి ద్వివేది ( Tanya Hope )హీరోయిన్లుగా నటించారు.తమిళ దర్శకుడు ప్రశాంత్ రాజ్ తెరకేక్కించిన ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు బ్రహ్మానందం.
ఈ సినిమాలో ఆయన సైంటిస్ట్ వాలి అనే పాత్ర పోషించారు.ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.2016 లో కన్నడలో విడుదలయ్యి, సూపర్ హిట్ అయిన “జూమ్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించలేదు.తాజాగా “డిడి రిటర్న్స్” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సంతానం, ఈ సినిమా విజయంతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుందాం అనుకున్నాడు.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
తాజాగా ఓటిటి లో విడుదలైన ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో వుంది.ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వరస్ట్ సినిమా అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరి కొందరు రెండున్నర గంటల సమయం వృధా ఐపోయింది అంటూ సెటైర్లు వేస్తున్నారు.సినిమా అంత డబల్ మీనింగ్ డైలాగులతో నింపేసారని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.