టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S.

Venkatrav ) అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 15 న టెట్ పరీక్ష నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సిహెచ్.

ప్రియాంక,ఏ.వెంకట్ రెడ్డితో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పేపర్ -1 ఉదయం 9.30 నుండి మద్యాహ్నం 12.00 గంతల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని,జిల్లాలోని సూర్యాపేట 30,అలాగే కోదాడలో -1 కేంద్రం మొత్తం 31 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,సూర్యాపేటలో 7200 మంది అలాగే కోదాడలో 197 మంది మొత్తం 7397 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.అదే విధంగా మద్యాహ్నం నిర్వహించే పేపర్ -2 పరీక్షకు సూర్యాపేటలో 28 కేంద్రాలు,కోదాడలో 1 కేంద్రం మొత్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిచడం జరుగుతుందని, సూర్యాపేటలో 6654 మంది,కోదాడలో 10 మంది మొత్తం 6664 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.పరీక్ష నిర్వహణ సందర్బంగా ఆరు రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

పరీక్ష రోజున అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పక అమలు చేయాలని,నిరంతర విద్యుత్,త్రాగునీరు, ఏఎన్ఎంతో మెడికల్ స్టాల్ ఏర్పాటు చేయాలని సూచించారు.అభ్యర్థులు ఎక్కడకూడా ఇబ్బంది పడకుండా రూట్ల వారీగా బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

ముందుగా చీఫ్ సూపురిండెంట్లకు పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,ఈ పరీక్ష నిర్వహణకు 31 మంది చీఫ్ సూపరిండెంట్లు, అలాగే జిల్లా అధికారులు, 123 మంది హాల్ సూపరిండెంట్లు,309 మంది ఇన్విజిలేటర్స్ లను నియమించడం జరిగిందని అన్నారు.పరీక్ష నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అనుబంధ శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర రావు, డిఈఓ అశోక్,డిఎస్పీ రవి అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News