ఉల్లి నారు పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలు..!

ఉల్లి పంట( Onion cultivation )లో అధిక దిగుబడి సాధించాలంటే నారు పెంపకంలో యాజమాన్య పద్ధతులను పాటించాలి.ఆరోగ్యవంతమైన నారును పెంచితే మాత్రమే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.

 Precautions To Be Followed In Onion Cultivation , Onion , Onion Cultivation , F-TeluguStop.com

ఉల్లినారు పెంచడానికి ఎంచుకున్న భూమిని నేలకు ఆరు అంగుళాల ఎత్తులో బెడ్డుల రూపంలో మట్టిని పోసుకోవాలి.ఈ బెడ్ల మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్ల మధ్య దూరం ఉంటే కలుపు నివారణ, నీరు అందించడం, సంరక్షణ చర్యలకు అనువుగా ఉంటుంది.విత్తనాల మధ్య సమాన దూరాలు ఉండేలా విత్తుకోవాలి.

ఒక ఎకరం పొలానికి నాలుగు కిలోల విత్తనాలు అవసరం.ఈ విత్తనాలను ముందుగా ఎనిమిది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదంటే మూడు గ్రాముల తైలంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.తన శుద్ధి చేయడం వల్ల ఉల్లినారుకు తెగులు ఆశించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.సేంద్రియ ఎరువులకే ( Organic fertilizers )అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.నేలలోని తేమశాతాన్ని బట్టి నారుకు నీటి తడులు అందించాలి.ఏవైనా తెగులు సోకిన నారు మొక్కలు ఉంటే.

వెంటనే పీకి నాశనం చేయాలి.నారు మొక్కల మధ్య ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను పీకేయాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యమైన నారు ప్రధాన పొలంలో నాటుకొని అధిక దిగుబడి సాధించవచ్చు.

నేలను లోతు దుక్కులు దున్నుకోని భూమిని వదులుగా చేసుకోవాలి.ఆ తరువాత ఆఖరి దుక్కి తర్వాత చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి.పంటకు నీటి తడి అందిస్తున్నప్పుడు నీరు నిల్వ ఉండకుండా పొలం బయటకు వెళ్లే విధంగా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేసుకోవాలి.

ఉల్లి నారును ఎత్తు బెడ్ల పద్ధతి లేదంటే చిన్నచిన్న మడులలో నాటుకునే పద్ధతి ద్వారా నారు పెంపకం చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube