2023 వ సంవత్సరం ప్రారంభం అయ్యి మొన్ననే అన్నట్టుగా అనిపిస్తుంది కదూ, కానీ అప్పుడే ఏడాది పూర్తి అవ్వబోతుంది.ఈ ఏడాది మిగిలిన రంగాలకు ఎలా ఉందో తెలియదు కానీ, టాలీవుడ్ సినిమా రంగానికి మాత్రం పెద్దగా కలిసి రాలేదు అనే చెప్పాలి.
సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )’ చిత్రమే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్.ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ , పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రాలు నిరాశపర్చాయి.
కానీ ఈ ఏడాది మొత్తం డబ్బింగ్ సినిమాలు మరియు చిన్న సినిమాల నుండే టాలీవుడ్ కి భారీ రెవిన్యూ వచ్చింది అని చెప్పొచ్చు.ఇది చాలా దురదృష్టకరం అనే చెప్పాలి.
స్టార్ హీరోల సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ లో పండుగ వాతావరణం నెలకొంటుంది , కానీ ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాల వల్ల వచ్చిన నష్టాలే ఎక్కువ.

‘సలార్( Salaar )’ చిత్రం మీద బయ్యర్స్ భారీ ఆశలు పెట్టుకొని ఉండేవారు, కానీ ఆ చిత్రం కూడా వాయిదా పడింది.ఈ ఏడాది వస్తుందా?, లేదా వచ్చే ఏడాది లో వస్తుందా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.ఇదంతా పక్కన పెడితే స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రూల్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 15 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.
దీంతో దేవర చిత్రం క్లాష్ తప్పింది.ఇప్పుడు ‘దేవర’ చిత్రానికి పోటీ గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
దేవర చిత్రాన్ని ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం మార్చి 22 వ తారీఖున విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.

ఇది వరకు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మరియు ఎన్టీఆర్ సినిమాలు చాలా సార్లు పోటీ పడ్డాయి.అయితే ఎన్టీఆర్( Jr Ntr ) ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ మీద విజయం సాధించలేకపొయ్యాడు.బాలు మరియు నా అల్లుడు,( Naa Alludu ) రాఖి మరియు అన్నవరం( Annavaram ), గబ్బర్ సింగ్ మరియు దమ్ము, అత్తారింటికి దారేది మరియు రామయ్య వస్తావయ్యా ఈ సినిమాలు అతి రోజుల గ్యాప్ తో పోటీ పడ్డాయి.వాటి ఫలితాలు మన అందరికీ తెలిసిందే.
ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ పై విజయం సాధిస్తాడా?, లేకపోతే ఎన్టీఆర్ ఈసారి పవన్ కళ్యాణ్ మీద పై చెయ్యి సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ఈ రెండు చిత్రాల మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.