పది పరీక్షలు పక్కాగా నిర్వహించాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యాశాఖ,అనుబంధ శాఖాధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పదవ తరగతి పరీక్షలలో 12,612 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని,ఆ దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Ten Tests Must Be Performed Correctly: Collector-పది పరీక్షల

మే 23 నుండి జూన్ ఒకటి వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించే 73 పరీక్ష కేంద్రాలలో అన్ని మౌళిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్బంగా పోలీసు అధికారులను ఆదేశిస్తూ అన్ని కేంద్రాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అలాగే జిల్లా పంచాయతీ అధికారి,మున్సిపల్ కమీషనర్లు సిబ్బందితో అన్ని పరీక్షా కేంద్రాలను షానిటైజెషన్ చేసి ప్రతి రోజు త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు.

వైద్యా సిబ్బంది అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ కిట్స్ తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు,ప్యారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంచాలని అదేవిధంగా పోస్టల్ శాఖ పర్యవేక్షకులు మధ్యాహ్నం 3:00 గంటల వరకు,భోజన విరామ సమయంలో కూడా జవాబు పత్రము కలిగియున్న బండెల్స్ తప్పక స్వీకరించాలని సూచించారు.రవాణా శాఖ విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష రోజులలో ఎక్కువ బస్సులు నడపాలని అన్నారు.

Advertisement

పరీక్షల సమయంలో ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని,వేసవి దృష్ట్యా అన్ని పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు సరఫరా చేయవలసినదిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరీక్ష కేంద్రములలోకి సిబ్బంది అలాగే విద్యార్ధులు సెల్ ఫోన్ తీసుకొని వెళ్లకుండా చూడాలని అన్నారు.

అలాగే పరీక్ష నిర్వహణ బిల్లులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జిల్లా కోశాధికారిని ఆదేశించారు.ఈ సమావేశంలో డిఈఓ అశోక్,ఉప కోశాధికారి రమేష్,డిఎం అండ్ హెచ్ఓ కోటా చలం,పోలీస్, రవాణా,పోస్టల్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News