తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 6 బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 6 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.49

రాహుకాలం: మ.01.03 నుంచి 03.46 వరకు

అమృత ఘడియలు: ఉ.08.40 నుంచి 09.25 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.52 నుంచి 08.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.ఈరోజు మీ ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఒకరిది ఇబ్బంది పెడుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభం ఉంది.

సింహం:

ఈరోజు మీకు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ప్రయాణాల వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపార పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

తులా:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యాయి అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మనశ్శాంతి కోసం స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు ఎక్కువ శ్రమ ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు ఇతరుల నుండి ధనసహాయం కలుగుతుంది.ఆరోగ్య సమస్య నుండి కుదుట పడతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీని గురించి చింత చెందాల్సిన అవసరం లేదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కోల్పోయిన వస్తువులు తిరిగి దొరికే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడటం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో ఏ విషయం గురించి అయినా ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

మీనం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.దైవ దర్శనాలు వంటి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

బంధువుల నుండి శుభవార్త వింటారు.దీని వల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

#Jathakam #TeluguDaily #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU