ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ తహశీల్దార్ పుష్పాలత

రాజన్న సిరిసిల్ల జిల్లా : పాలనను ప్రజలకు మరింతచేరువ చేయడంతో పాటు ప్రతి గడపకూ సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనీ తహశీల్దార్ పుష్పలత( Tehsildar Pushpalata ) అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమములో తహశీల్దార్ హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం సందేశాన్ని ఎంపీడీవో నల్ల రాజెందర్ రెడ్డి ప్రజలకు చదివి వినిపించారు.అనంతరం తహశీల్దార్ మాట్లాడుతు 6 గ్యారంటీ ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

డిసెంబర్ 28 నుండి ప్రజా పాలన సదస్సులు నిర్వహించి అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారనీ తెలిపారు.మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏంపిటిసి బాలగోనీగౌతమి శ్రీనివాస్ మండల పంచాయతీ అధికారి గంగ తిలక్, తదితరులు ఉన్నారు.

Advertisement
ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News