టీడీపీ జనసేన పొత్తు ! జగన్ కు కలిసివస్తున్న ఆ ప్రచారం

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ , జనసేన( TDP Jana Sena ) పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నాయనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మూలఖత్ అయ్యారు.

 Tdp Jana Sena Alliance That Campaign Is Coming Together For Jagan , Tdp, Ysrcp,-TeluguStop.com

ఆనంతరం బయటకు వచ్చిన పవన్ పొత్తు ప్రకటన చేశారు.తమ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి కారణం జగన్ అని, వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యం అని పవన్ ప్రకటించారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో వైసిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళబోతోంది అనే విషయం అందరికీ అర్థమైంది.అయితే టిడిపి , జనసేన కలిసి పోటీ చేస్తుండడం తో వైసిపి విజయ అవకాశాలు పెద్దగా ఉండవని,  వచ్చేది తమ ప్రభుత్వమేనని టిడిపి , జనసేన నాయకులు ప్రకటిస్తుండగా,  జగన్ మాత్రం ఎన్నికల్లో గెలుపు పై లెక్కలు వేసుకుంటున్నారు.

టిడిపి, జనసేన గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండగా వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీలు కలవడం వల్ల తమకే మేలు జరుగుతుందని అంచనా వేస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Tdpjanasena, Telugudesham, Ysrcp-Politics

 అయితే జనాల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది ప్రధానంగా మారింది.ఇప్పటికే ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉండడం,  ఇంకా మరికొన్ని కొత్త పథకాలను ప్రకటించే ఆలోచనతో జగన్ ( Cm Jagan )ఉండడం తో పేద,  మధ్యతరగతి వర్గాల్లో జగన్ కు ఆదరణ గతం కంటే ఎక్కువ పెరిగిందనే లెక్కలు తెరపైకి వస్తున్నాయి.  2014 , 2019 ఎన్నికల్లో జగన్ ఒంటరిగానే పోటీ చేశారని , 2024 లో కూడా ఒంటరిగానే పోటీ చేయబోతున్నారని , గెలిచినా, ఓడిన జగన్ ( Cm Jagan )ఒంటరిగానే తన బలాన్ని నిరూపించుకుంటున్నారని , కానీ మిగతా పార్టీలు ఆ విధంగా లేవనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లో ఉంది.

Telugu Ap Cm Jagan, Ap, Janasena, Tdpjanasena, Telugudesham, Ysrcp-Politics

టిడిపి ,జనసేన పొత్తు కారణంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వైసిపి కి ఎదురు గాలి వీచినా,  మిగతా చోట్ల మాత్రం జగన్ కే అడ్వాంటేజ్ ఉందనే లెక్కలు బయటకు వస్తున్నాయి.జనాల్లోనూ ఈ పొత్తులు,  ఒంటరి పోరాటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండడం తో వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది మరింత ఆసక్తికరంగా మారుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube