మెడిసిన్ లో కృషి విద్యాలయ పూర్వ విద్యార్థునుల ప్రతిభ

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన కృషి విద్యాలయంలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎన్.హారిక తండ్రి నాగిరెడ్డి మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో, వేపల మాదారం గ్రామానికి చెందిన కె.

సుప్రియ తండ్రి అభినవ్ జనగామ ప్రభుత్వ వైద్యశాలలో 2024 సంవత్సరంలో మెడిసిన్ సీటు సాధించడం తమకు గర్వకారణమని కృషి విద్యాలయ చైర్మన్ పోశం జానకి నర్సిరెడ్డి అన్నారు.బుధవారం ఆమె మాట్లాడుతూ మెడిసిన్ సీటు సాధించిన తమ పూర్వ విద్యార్థినులకు అభినందనలు తెలిపారు.

మనం ఎక్కడికి వెళ్ళినా పుట్టిన గడ్డను మరువద్దని,అందరికీ ఆదర్శంగా నిలిచి మేళ్లచెరువు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Talent Of Krishi Vidyalaya Alumni In Medicine, Talent ,Krishi Vidyalaya Alumni ,

ఈకార్యక్రమంలో పోశం వీరారెడ్డి,ప్రిన్సిపల్ సోమవరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

Latest Suryapet News