ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకొండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత మెరుగైన విద్య అందిస్తున్నామని , ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలనీ, ప్రభుత్వ ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరారు.

తేదీ 24న కోరుట్లపేట, బొప్పాపూర్,రాగట్లపల్లి, పదిర గ్రామాల్లో అధ్యాపకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఉచిత పుస్తకాలు అందించబడుతాయనీ, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన , విశాలమైన గదుల సౌకర్యం, ఇంగ్లీష్ , తెలుగు మీడియం బోధన సౌకర్యం,స్కాలర్షిప్ సౌకర్యం కలదనీ, తెలిపారు.సాంస్కృతిక, క్రీడల్లో ప్రోత్సాహం , ఎన్.ఎస్.ఎస్ ద్వారా సామాజిక సేవకులను తయారు చేయడం, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు , ప్రతిభా పురస్కారాలు,వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు,బుట్ట కవిత ,కొడిముంజ సాగర్, చిలుక ప్రవళిక తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

Take Advantage Of Free Government Education, Free Government Education, Yellare
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Latest Rajanna Sircilla News