తహశీల్దార్ ఆఫిస్ తాళాలు పగులగొట్టి చోరీ

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం( Tahsildar office )లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వెనుక ఉన్న ఇనుప గేట్ తాళాన్ని పగలగొట్టి ఇన్వర్టర్ బ్యాటరీని చోరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం ఉదయం విధులకు హాజరైన అటెండర్ గేట్ తాళం పగలగొట్టి ఉండడం చూసి పరిశీలించగా ఇన్వర్టర్ బ్యాటరీ ( Inverter battery)లేకపోవడంతో దొంగలు పడ్డ విషయాన్ని పై అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

గతంలో హుస్సేన్ అనే అటెండర్ వాచ్ మెన్ గా ఉండేవాడని,కొద్ది నెలల క్రితం అతను చనిపోవడంతో ప్రస్తుతం వాచ్ మెన్ లేడని,దీనితో దొంగలు దర్జాగా తాళం పగులగొట్టి చోరికి పాల్పడ్డారని భావిస్తున్నారు.ఇప్పటికైనా వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే గరిడేపల్లి మండల( Garidepalli) కేంద్రంలో ఈ వేసవికాలం తరచూ ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉందని,ఈ మధ్యకాలంలో రాత్రి వేళలో కీతవారిగూడెం నగల దుకాణంలో చోరీ, వ్యవసాయ మోటార్ల చోరీసంఘటనలు ఉన్నాయని,రాత్రి వేళలో దొంగతనాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Latest Suryapet News