యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం ( Turkapally )దత్తాయపల్లిలో,రాజాపేట మండలం చల్లూరు గ్రామ శివారులో యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం నడిపిస్తున్న క్రషర్ మిషన్ పై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.గ్రామస్థులతో కలిసి క్రషర్ మిషన్ ను నిలుపుదల చేయించిన అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.
జెండగే( Hanumant k zendage )కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.భారీ శబ్దాలతో బ్లాస్టింగ్ చేస్తూ పరిసర ప్రాంతాల్లోని ఇళ్ళకు పగుళ్లు వచ్చేలా చేస్తున్నారని,వారి భూములతో పాటు ఇతరుల భూములను సైతం దౌర్జన్యంగా ఆక్రమించారని ఆరోపించారు.
ఈ భూ వివాదం కోర్టులో పెండింగ్ లో ఉన్నా కూడా క్రషర్ మిషన్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ను కూడా అక్రమ మార్గంలో ఏర్పాటు చేసుకొని కంకర మిషన్లు నడిపిస్తున్నారన్నారు.అధిక లోడ్ లతో వాహనాల వెళ్తూ గ్రామంలో అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారని, రైతులు ( Farmers )తమ పొలాలకు వెళ్ళే దారి మొత్తం గుంతలమయం కావడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళాలంటే జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయితీ త్రాగునీటి పైపులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.







