చిలసౌ సినిమాతో హిట్ అందుకున్న అక్కినేని హీరో సుశాంత్ ఆ తర్వాత అల వైకుంఠపురములో సినిమాతో ఆకట్టుకున్నాడు.ఆ సినిమాలో సపోర్టింగ్ రోల్ అయినా సరే సుశాంత్ అలరించాడు.
ఇక లేటెస్ట్ గా నూతన దర్శకుడు దర్శన్ డైరక్షన్ లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో వచ్చాడు సుశాంత్.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.
చిలసౌ తరహాలోనే ఒక రోజులో జరిగే కథగా ఈ సినిమా వచ్చింది.ఇక సినిమా టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా థియేటర్ లో మాత్రం ఆడియెన్స్ ను అలరించలేదని అంటున్నారు.
కొత్త బైక్ కొని తన ప్రేయసినే ముందు బైక్ ఎక్కించాలనే సర్ ప్రైజ్ తో ఆమె ఉన్న కాలనీ కి వెళ్లిన హీరో అనుకోని చిక్కుల్లో పడతాడు.ఆ టైం లో హీరో ఏం చేశాడు అన్నది సినిమా కథ.సినిమాలో ఒకప్పటి హీరో వెంకట్ విలన్ గా నటించాడు.సినిమాను దర్శకుడు అనుభవరాహిత్యంతో తెరకెక్కించాడని తెలుస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ, లవ్ సీన్స్ తో తీయగా అవి బోర్ కొట్టించేలా ఉన్నాయని అంటున్నారు.ఇక సెకండ్ హాఫ్ కొన్ని ట్విస్టులు ఉన్నా సరే వాటిని కూడా డైరక్టర్ సరిగా హ్యాండిల్ చేయలేదని అంటున్నారు.
ఓవరాల్ గా సుశాంత్ సినిమా మరోసారి నిరాశపరచిందని అంటున్నారు.