సీనియర్ నటీమణులతో కలిసి స్టెప్పులు ఇరగదీసిన సురేఖా వాణి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఎంతమంది ఉన్నారో అలాగే అత్త,వదిన,అమ్మ పాత్రలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు బోలెడు మంది ఉన్నారు అని చెప్పవచ్చు.ఇక సురేఖ వాణి, పవిత్ర లోకేష్,హేమ, ప్రగతి ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్లలో అలాగే వదిన అత్తయ్య క్యారెక్టర్లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Surekha Vani Dance Video Viral With With Senior Character Artists Details, Surek-TeluguStop.com

ఇప్పటికీ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూనే ఉన్నారు.అయితే కొంతమందికి వెండితెరపై సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ లో రాణిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఇంట్లో ఒకప్పటి సీనియర్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిశారు.అంతేకాకుండా అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడంతో పాటు ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు పాటలకు స్టెప్పులు కూడా వేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిసి రారా అక్కమ్మ అనే సాంగ్ కు స్టెప్పులని ఇరగదీశారు.ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అయితే అంతా బాగానే ఉంది కానీ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన పవిత్ర లోకేష్ ప్రగతి ఇద్దరు మిస్ అయ్యారు.

అయితే గెట్ టుగెదర్ పార్టీలో అంతా కలవడంతో అందరూ సరదాగా కలిసి రచ్చ రచ్చ చేస్తూ ఎంజాయ్ చేశారు.కు సంబంధించిన ఫోటోలను సురేఖ వాణి తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ లవ్ సింబల్ ఎమోజి ని అటాచ్ చేసింది.అయితే ఆ ఫోటోలో కనిపిస్తున్న చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులలో కొందరు సినిమా ఇండస్ట్రీకి దూరం కాగా మరికొందరు మాత్రం ఇప్పటికీ సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ దూసుకుపోతూనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube