గంజాయి మత్తుకు చిత్తవుతున్న విద్యార్ధులు

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం శ్రీరంగా పురం వద్ద గంజాయి విక్రయిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి,కోదాడ తహసిల్దార్ జె.

శ్రీనివాసశర్మ,కోదాడ టౌన్ ఎస్ఐ ఎం.

రామాంజనేయులు సంయుక్త పంచనామా నిర్వహించారు.వారి నుండి సుమారు రూ.80 వేల విలువ చేసే 16 కిలోల గంజాయిని,5 బైకులను,6మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి,కేసు వివరాలను వెల్లడించారు.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామానికి చెందిన పెరుమాళ్ల రజనీకాంత్ (23) పెరుమాళ్ల ప్రకాష్(20) పోతుల నవీన్(21),సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బాలాజీనగర్ కు చెందిన భూక్య భువనేశ్ (20)బర్మావత్ గురుచరణ్(20),ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రానికి చెందిన దాసరి వినయ్(23),తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఏపూరి సందీప్(21),ఏపూరి వెంకటేష్ (21),హైద్రాబాద్ కు చెందిన ఇమ్రాన్ ఈ ముఠాలో సభ్యులు కాగా ప్రస్తుతం ఒకరు పరారీలో ఉన్నారన్నారు.వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని,ఏ-1 గా ఉన్న పెరుమాళ్ల రజనీకాంత్ కు హైద్రాబాద్ లో ఇంటర్ చదివే రోజుల్లో గంజాయి అలవాటైందని, పెరిక కొండారం తిరిగి వచ్చిన తర్వాత గంజాయి ఎక్కడా దొరకనందున వైజాగ్ సమీపంలోని అరకు వ్యాలీకి వెళ్ళి అక్కడ గంజాయిని తక్కువ ధరకి కొని, కొంతభాగం త్రాగడానికి ఉంచుకొని, మిగిలినది ఎక్కువ రేటుకి విక్రయించడం చేస్తున్నట్లు చెప్పారు.

అనంతరం వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేందుకు తరలించారు.ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన కోదాడ టౌన్ సీఐ కె.శివశంకర్,కోదాడ పట్టణ ఎస్ఐ ఎం.రామాంజనేయులు,మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, కోదాడ డిఎస్పీ జి.వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్,కోదాడ పట్టణ సిఐ శివశంకర్,ఎస్సై రామాంజనేయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News