ఎన్నికల నిబంధనలకు పటిష్టంగా అమలు:జిల్లా అబ్కారీ అధికారిణి అనిత

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయుటకు సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ శాఖ చాలా జాగరూకతతో పనిచేస్తుందని సూర్యాపేట జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారిణి కె.

అనిత ( Excise Officer K.

Anitha )ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ విషయమై ప్రజలను మరింత అప్రమత్తం చేయుటకు మరియు కల్తీ మద్యం,అక్రమ మద్యం సరఫరా,నిల్వల గురించి ప్రజల నుండి పిర్యాదులు,సమాచారం తీసుకొనుటకు ఎక్సైజ్ శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523 కు కాల్ చేసి తెలుపవలసినదిగా కోరారు.

Strict Implementation Of Election Rules District Abkari Adhikari Anita , Distric

అదేవిధంగా వినియోగదారులు,వైన్ షాపుల నుండి కొనుగోలు చేసిన మద్యం సరైనదా,కాదా తెలుసుకొనుటకు VERIT మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ మూతపై గల హోలోగ్రాంను స్కాన్ చేయగానే,ఆ బాటిల్ బ్రాండ్,పరిమాణం,ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్,తయారీ తేదీ, బాటిల్ జారీ చేయబడిన డిపో మరియు వైన్ షాప్ పేరు డిస్ ప్లే అవుతుందన్నారు.

ఒక వేళ ఆ మద్యం నకిలీ లేదా అక్రమ మద్యం అయితే ఈ వివరాలేవీ కనిపించవన్నారు.ఈ VERIT మొబైల్ యాప్ ను అందరూ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని,ప్రజలందరికీ ఇట్టి విషయాలను తెలియజేస్తూ ఏవైనా ఫిర్యాదులు,అక్రమ మద్యం గురించి సమాచారం ఉంటే వెంటనే తెలియపరచి, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహింపబడుటకు సహకరించవలసినదిగా ప్రజలకు దూరమైన విజ్ఞప్తి చేశారు.

Advertisement

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.

Advertisement

Latest Suryapet News