ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఎవరైనా ప్రభుత్వ భూములను( Government Lands ) ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా మోతె మండల తాహశీల్దార్ ప్రకాష్ రావు హెచ్చరించారు.

శనివారం మోతె మండల పరిధిలో జరిగిన ప్రభుత్వ డొంక ఆక్రమణపై ఆయన వివరాలను వెల్లడించారు.

మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన కోల అబ్బులు కుమారుడు కోల రవి ప్రభుత్వ డొంకను జేసిబి సహాయంతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కోల నర్సయ్య భార్య లక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పని చేస్తున్న జేసీబీని అదుపులోకి తీసుకొన్నామని,డొంక ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest Suryapet News