బోయినిపల్లి లో భారీ వర్షంతో కల్వర్టుపై నుండి పారుతున్న వాగులు.

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా జేసీబి( JCB ) సాయంతో పిచ్చి మొక్కలను తొలగించిన డిఎస్పి నాగేంద్ర చారి( DSP Nagendra Chari ).రాజన్న సిరిసిల్ల జిల్లా: గత కొన్ని రోజులుగా బారి వర్షాలు కురుస్తుండటంతో బోయినపల్లి నుండి వేములవాడ వెళ్లే రహదారిలో ఉన్న కల్వర్టు పై నుండి వాగు పారడంతో బోయినిపల్లి వేములవాడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో జెసిబి తో కల్వర్టు వద్ధ పిచ్చి మొక్కలు ,చెత్త చెదారం, బారి వృక్షాలు తొలగించారు.

డీఎస్పీ నాగేంద్ర చారి మాట్లాడుతూ భారీ వర్షాలు పడుతుండడంతో తో వాగులు వంకలు పొంగిపొర్లుతున్న సందర్భంలో వాటి వద్దకు ప్రజలు పోరాదని సూచించారు.

డీఎస్పీ వెంట ఎస్సై మహేందర్ ,నాయకులు సంబ లక్ష్మీరాజం, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు ఉన్నారు.

Streams Flowing From The Culvert In Boinipally After Heavy Rain , Heavy Rain, DS
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News