భారతీయ సంప్రదాయం ప్రకారం.ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే.
మూడో రోజు నుంచి పదో రోజు వరకు కాకులకు పిండం పెట్టడతాం.మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారని మన నమ్మకం.
కాకులు అది తినకపోతే.చనిపోయినవారు సంతృప్తి చెందలేదా అని.సందేహ పడతాం.కాకికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
అది దీర్ఘకాలం జీవిస్తుంది.కాకి ఒక కన్ను పితృ దేవతలకు నివాసం అని చెబుతారు.
అందుకే పిండ ప్రదాన సమయంలో కాకి చూసిందంటేనే పితృదేవతల అనుగ్రహం లభించిందని భావిస్తారు.ఇక తినడం, తినక పోవడం దాని ఇష్టం.
అంతేకాని, తింటేనే పితృదేవతలు సంతృప్తి చెందినట్టు అని, తినకపోతే వారికి సంతృప్తి చెందలేదని కాదు.అది దోషమని భావించడానికి ఆధారం లేదు.
తింటే మాత్రం శుభమని లోకంలో ప్రచారంలో ఉంది.
కాకికి పిండం పెట్టడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది.
పూర్వం రావణుడికి భయపడి యముడు.కాకి రూపాన్ని ధరించాడు.
తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు.అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు.
యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగు తుందన్నారు.యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందు వల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.
రామాయణం ప్రకారం రాముడు.ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తుంటారు.
కాకులకి ఆహారం పెడితే నీ పూర్వికులకి చేరుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకి ఆహారాన్ని పెడతారనే మరొక కథ ప్రచారంలో ఉంది.