భారత వ్యోమగాముల కోసం స్పెషల్ బిర్యానీ.. ఏంటో తెలుస్తే షాక్ అవుతారు.. ?

ప్రపంచం ఊహకు అందని విధంగా ముందుకు వెళ్లుతుంది.అందులో మనిషి సృష్టించిన టెక్నాలజీ ఎన్నో అద్భుతాలను పరిచయం చేస్తుంది.

అసలు ఈ లోకంలో మానవుడు అనే జీవి లేకుంటే ఇన్ని అధ్బుతాలు ఆవిష్కృతం అయ్యేవా.అయితే మనిషి చేత సృష్టించిన ప్రతీది తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తుంటే.

Special Biryani For Indian Astronauts, Indian Astronauts, Food Menu, Chicken Kur

మనిషి మాత్రం యంత్రంలా తయారవుతూ అన్నీ మరచిపోతున్నాడు.ఇక ఇదంతా పక్కన పెడితే నెలల తరబడి అంతరిక్షంలో గడిపే వ్యోమగాములు ఏం తింటారు అనే సందేహం ప్రతి వారిలో కలుగక మానదు.

ఎంతైనా భుమి మీద ఉన్న వారు తిన్నంత సౌకర్యంగా వ్యోమగాములు తినరు.అందుకే మన ఇండియన్ సైంటిస్టులు భారత వ్యోమగాముల కోసం ప్రత్యేక ప్యాకింగ్ ఫుడ్‌ను తయారు చేసింది.

Advertisement

మైసూర్ కేంద్రంగా పని చేస్తోన్న డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ వారు త్వరలో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ ప్యాకింగ్ ఫుడ్‌ను రెడీ చేశారు.ఆవకాయ పచ్చడి, చికెన్ కుర్మా, బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా.

వంటి 40 రకాల పదార్థాలను తయారు చేసినట్లు ల్యాబ్‌లో ఒక అధికారి తెలియజేశారు.ఇవి అంతరిక్షంలోనే వేడిచేసుకుని తినడానికి వీలుగా తయారు చేయడం విశేషం.

ఇక ఈ ఆహారపదార్ధాలు తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకూ పాడవకుండా ఉంటాయట.అంతే కాకుండా వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా చేశారట.

కాగా ఫుడ్ ప్యాకెట్లను ఇప్పటికే పరీక్షించగా అనుకూల ఫలితాలే వచ్చాయని అధికారులు తెలియచేస్తున్నారు.

ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు