టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి అందరికీ పరిచయమే.ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేసింది.ఇక ఈమె ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.చాలావరకు సమాజంలో జరిగే విషయాలకు బాగా స్పందిస్తుంది.
సమాజంలో జరిగే అన్యాయాల గురించి, మహిళలపై, అమ్మాయిలపై జరిగే దాడుల గురించి బాగా స్పందిస్తుంది.నిజానికి ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రతి ఒక్కరి బాధలను తెలుసుకొని వాటికి స్పందిస్తుంది.ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు తనకు తమ బాధలు గురించి చెబుతూ తమపై ఉన్న భారాన్ని తగ్గించుకున్నారు.
అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.అందులో చాలా మంది కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాల గురించి, హెల్త్ టిప్స్ ల గురించి అడిగి సలహాలు తెలుసుకుంటారు.
హెల్త్ విషయంలో, బ్యూటీ విషయంలో కూడా నిత్యం ఏదో ఒక టిప్ చెబుతూనే ఉంటుంది చిన్మయి.నిజానికి చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి అండగా ఉందనే చెప్పవచ్చు.
ఇక ఈమె సోషల్ మీడియాని ఎక్కువగా ఇటువంటి వాటి కోసమే బాగా ఎక్కువగా ఉపయోగిస్తుంది.తక్కువ సందర్భాల్లో ఫోటోలను పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా చిన్మయికి ఓ అమ్మాయి తనకు జరిగిన చేదు ఘటన గురించి పంచుకుంది.ఇక ఆమె పంచుకున్న విషయం ప్రస్తుతం అందర్నీ కదిపింది.
ఇంతకు ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ఏమిటంటే.
తనకు పదహారేళ్ళ వయసు ఉన్న తమ్ముడు ఉన్నాడు అని తన ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టుగా తాకుతూ ఉంటాడు అని.అదే విషయాన్ని తన పేరెంట్స్ కు చెబితే.వాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు అంటూ.
యవ్వనంలోకి వస్తున్నాడు అంటూ.కంట్రోల్ చేసుకోలేక పోతున్నాడు అని అన్నారట ఆ తల్లిదండ్రులు.
నువ్వే సరిగ్గా నీ శరీరాన్ని దాచుకోవడం లేదు అని.అది నీ తప్పు అయి ఉంటుంది అని వాళ్లు అనటంతో తన నోట మాట రాలేదు అని.ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోవాలని అనుకోవటం తో తనకు 19 ఏళ్ల వయసు ఉన్నాయని అందుకే ఆగిపోయానని తెలిపింది.ఆ అమ్మాయి పంచుకున్న బాధను స్క్రీన్ షాట్ ద్వారా చిన్మయి పంచుకుంది.
ఇక ఈ విషయం పట్ల చిన్మయి బాగా ఫైర్ అయ్యింది.మీకు అమ్మాయిలు అంటే ఎందుకంత ద్వేషం అంటూ.ప్రశ్నించింది.ఇలా చిన్నయి తనకు వచ్చిన ఇటువంటి మెసేజ్ లకు వెంటనే స్పందిస్తూ ఉంటుంది.అంతే కాకుండా వాటికి సరైన సలహాలు కూడా ఇస్తుంది.ఇప్పటికి ఇలాంటి విషయాలలో చాలా వరకు చాలామందికి సలహాలు ఇచ్చింది.
మొత్తానికి చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది మహిళలకు, అమ్మాయిలకు రక్షణ గా ఉంటూ వారి ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ చెబుతుంది.