గాంధీ విగ్రహం వద్ద వీఆర్ఏల మౌన దీక్ష

సూర్యాపేట జిల్లా:గత 70 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న నిరసన సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వీఆర్ఏ జేఏసీ సూర్యాపేట జిల్లా కో- కన్వీనర్ పాపయ్య అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత మౌన దీక్షతో నిరసన చేయాలని వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం గరిడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడాతూ 70 రోజులుగా నిరసన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని,దీనితో అనేకమంది వీఆర్ఏలు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గాంధీ జయంతి సందర్భంగా లేదా దసరా పండుగ అనంతరం వీఆర్ఏల సమ్మెపై ఒక ప్రకటన చేసి వారికి మనో ధైర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల వీఆర్ఏ జేఏసీ నేతలు పాల్గొన్నారు.

Silent Deeksha Of VRAs At Gandhi Statue-గాంధీ విగ్రహం �
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News