శివగంగా ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల చేసిన ఎస్ఐ

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండలం వెల్లటూరు శివారులో గల శివగంగా ఎత్తిపోతల పథకానికి సోమవారం ఎస్ఐ సైదిరెడ్డి శివగంగా ఎత్తిపోతల పథకం చైర్మన్ గుడిసె వెంకట్ రెడ్డితో కలిసి మోటార్లు ఆన్ చేసి నీటి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ సైదిరెడ్డి మాట్లాడుతూ రైతులందరూ నీటిని సద్వినియోగం చేసుకొని, మంచిగా పంటలు పండించుకొని,సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.

అలాగే నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మోర్తల సీతారెడ్డి,ఉస్తేలా నారాయణరెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొండపాటి వెంకటరెడ్డి, కాకునూరి అనిమిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి చింతిర్యాల రవి,సిపిఎం గ్రామ కార్యదర్శి జంగాల పుల్లయ్య,చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి,గంధం రామచంద్రయ్య,పొదిల గోపయ్య,కందుల సుందర మల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SI Released Water For Sivaganga Uplift Project, SI Saidireddy,released Water ,Si

Latest Suryapet News