బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలా వద్దా ? సందిగ్ధం లో ఎర్ర పార్టీలు ?

తెలంగాణలోని వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం( CPI, CPM ) లకు పెద్ద చిక్కే వచ్చి పడింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలా లేదా అనే విషయంలో రెండు పార్టీలలోను గందరగోళం నెలకొంది.

 Should I Go With Brs Or Not? Red Parties In Dilemma, Cpi, Cpm, Congress, Bjp, Te-TeluguStop.com

తమతో సఖ్యత గా ఉన్నట్టుగానే బిఆర్ఎస్( Brs ) వ్యవహరిస్తున్న,  పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలోనే మౌనంగా ఉండి పోవడం వంటివి అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని వామ పక్ష పార్టీలు ముందుకు వెళ్లినా,  ఇప్పుడు దూరంగానే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

పొత్తుల విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో, తాము ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో గందరగోళానికి గురవుతున్నాయి.బీఆర్ఎస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని సొంత పార్టీ నేతలకు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి.

Telugu Brs, Congress, Telangana-Politics

వామపక్ష పార్టీలు రెండు ఈ గందరగోళంలోని ఉండగానే , బీ ఆర్ ఎస్ కు చెందిన కొంతమంది కీలక నాయకులు పొత్తులపై స్పందిస్తున్నారు.సిపిఐ, సిపిఎం లతో పొత్తులు ఉంటాయి కానీ , ఆ రెండు పార్టీలకు సీట్లు ఇచ్చేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఇస్తామని పేర్కొనడం పై వామపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోని తెలంగాణలో కాంగ్రెస్( Congress in Telangana ) కు గెలుపు అవకాశాలు ఉన్నాయని , ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే మంచిదనే అభిప్రాయాలు కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట.అయితే మునుగోడు అసెంబ్లీ  ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు దూరంగా ఉంటే జనాల్లో చులకన అవుతామని, త్వరలోనే సీఎం కేసీఆర్( CM KCR ) తో ఈ పొత్తుల అంశం పైన చర్చించాలని వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారట.

Telugu Brs, Congress, Telangana-Politics

అయితే ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి వారాలు గడుస్తున్న, ఇప్పటి వరకు అపాయింట్మెంట్ దొరకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.బీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే 10 అసెంబ్లీ సీట్లు అడగాలని సిపిఐ, సిపిఎం ల భావించినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఐదు సీట్లు ఇచ్చిన సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నారట.ఆ సీట్లు ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధంగా లేకపోవడంతో వామపక్ష పార్టీలు ఆలోచనలు పడ్డాయి .నల్గొండ, ఖమ్మం వంటి రెండు మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపించగలుగుతామని, తమతో పొత్తు పెట్టుకుంటే బిఆర్ఎస్ కే ఎక్కువ లాభమని వామపక్ష పార్టీలో నేతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube