విద్యార్థి దశనుండి సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలి: డిఎస్పీ

సూర్యాపేట జిల్లా:విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలను గుర్తించండని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం అన్నారు.

బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు ట్రాఫిక్ పోలీస్ వారి ఆద్వర్యంలో సైబర్ నేరాలు-వాటి దుష్పలితాలు గురించి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సైబర్ నెరస్తుల వలలో చిక్కకుండా ఉండాలంటె అపరిచితులకు ఓటిపి నంబర్ ఇవ్వరాదని, అపరిచితులతొ చాటింగ్ చెయ్యరాదని మరియు ఎవరైనా బ్యాంక్ అకౌంట్స్ వివరాలు అడిగినా ఇవ్వరాదని తెలిపారు.విద్యార్థి దశ నుండి సైబర్ చట్టాలు,మోసాలు,సైబర్ సెక్యూరిటీపై అవగాహన కలిగి,ఇంట్లో వారికి,ఇరుగు పొరుగు వారికి వాటి గురించి తెలపాలని అన్నారు.

Should Be Aware Of Cybercrime From Student Stage: DSP-విద్యార్�

జిల్లాలో 100 స్కూల్స్ నందు విద్యార్థులను ఎంపిక చేసి సైబర్ వారియర్స్ గా శిక్షణ ఇవ్వడం జరిగినది అన్నారు.ఎవరైనా సైబర్ నేరాలకు గురైనచో వెంటనె టొల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫొన్ చెసి సహాయం తీసుకొవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజశేఖర్,ట్రాఫిక్ ఎస్ఐ నరేష్,స్కూల్ యాజమాన్యం,విద్యార్థులు,మరియు ట్రాఫిక్ సిబ్భంది పాల్గొన్నారు.

Advertisement
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News