ప్రతి తెలుగోడు గర్వించే సమయం ఇదే.. ఆస్కార్ లో తెలుగు హవా మొదలైనట్టే!

తెలుగు సినిమాలకు ఆస్కార్ రావాలని ప్రేక్షకులు ఎన్నో కలలు కన్నారు.అయితే ఆ కల నిజం కావడానికి ఇన్నేళ్లు పట్టింది.

 Shocking Facts About Rrr Movie Oscar Award Details, Rrr Oscar , Ntr , Ram Charan-TeluguStop.com

అయితే ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలకు ఆస్కార్ దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.టాలెంట్ ఉన్న ఎంతోమంది దర్శకులు తమ సినిమాలకు కూడా ఆస్కార్ అవార్డ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఆస్కార్ లో తెలుగు సినిమాల హవా మొదలైనట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.నాటు నాట్ సాంగ్ కు అవార్డ్ రావడంతో ప్రతి తెలుగోడు గర్వించే సమయం ఇదేనంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్కార్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ పులిబొమ్మ ఉన్న డ్రెస్ లో వచ్చారు.ఈ డ్రెస్ హైలెట్ గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్ మూవీలో పులి నాతో పాటు కనిపించిందని పులి ఇండియన్ నేషనల్ ఎనిమల్ అని పులి బొమ్మ ఉన్న డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై నడవటం గర్వంగా ఫీలవుతున్నానని తారక్ కామెంట్ చేశారు.ఇలా చేయడం నాకెంతో గర్వంగా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.యాంకర్ కూడా వెంటనే మిమ్మల్ని చూస్తే దేశం గర్వపడుతుందని కామెంట్ చేయడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ మన దేశ కీర్తి ప్రతిష్టలను సైతం మరింత పెంచింది.కమర్షియల్ సినిమాలతో ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకోవచ్చని నాటు నాటు సాంగ్ ప్రూవ్ చేసింది.కీరవాణి, చంద్రబోస్ లకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ కు అవార్డ్ రావడంతో రాజమౌళి సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.తన 20 ఏళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో జక్కన్న రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube