మంత్రి జగదీష్ రెడ్డికి హైకోర్టులో షాక్...!

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ తిరుగుబాటు నేత,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్చైర్మన్ వట్టే జానయ్య యాదవ్( Vatte Janaiah Yadav ) కు గురువారం హైకోర్టులో భారీ ఊరట లభించింది.

మంత్రి జగదీష్ రెడ్డిపై ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో వట్టే జానయ్య యాదవ్ పై ఒక్క రోజులోనే సుమారు 71 కేసులు నమోదయ్యాయి.

దీనితో ఆయన సతీమణి బీఆర్ఎస్ కౌన్సిలర్ వట్టే రేణుక హ్యుమన్ రైట్స్ కమిషన్ తో పాటు హై కోర్టును ఆశ్రయించారు.ఆమె పిటిషన్ గురువారం పరిశీలించిన హై కోర్టు ధర్మాసనం కేసులన్ని రాజకీయ కోణంలోనే పెట్టినవని పేర్కొంది.

Shock For Minister Jagdish Reddy In High Court , High Court, Minister Jagdish Re

అతనిపై పిడి యాక్ట్ లాంటివి నమోదు చెయ్యొద్దని,ఇలాంటి తప్పుడు కేసులు పెడితే పోలీసుపై కూడా చర్యలు వుంటాయని హెచ్చరించింది.రాజకీయ నేతల కోసం పోలీసులు పనిచెయ్యెద్దని,ప్రజల కోసం పని చెయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో త్వరలోనే సూర్యాపేట జిల్లా ఎస్పీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం?ఈ కేసులన్ని కొట్టేసే అవకాశం ఉందని తెలుస్తోంది.హై కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మంత్రి జగదీష్ రెడ్డికి చెంప పెట్టు లాంటిదని,జానయ్య యాదవ్ కు దక్కిన తొలి విజయమని ఆయన మద్దత్తుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా

Latest Suryapet News