త్రిలేంగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మాణం చేసిన ప్రసిద్ద త్రిలేంగేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

గతంలో శిధిలావస్థలో వున్న ఆలయాన్ని 1990 తరువాత గ్రామంలోని యువకులు ముందుకు వచ్చి బాగు చేసి,ధ్వజ స్ధంభ ప్రతిష్ఠ నిర్వహించి, పూజారిని ఏర్పాటు చేశారు.

ఆలయానికి వున్న వ్యవసాయ భూమిని ఆలయ పూజారి సాగుచేసి జీవనోపాధి పొందడంతో నిత్య పూజలు జరుగుతున్నాయి.గ్రామంలో రైతులు అందరూ తమ వంతు ఆర్దిక సహాయం చేయడంతో ఆలయ రూపురేఖలు మారిపోయాయి.

ఆలయం లోపల గ్రానైట్ బండలు,ఆలయం చుట్టూ ప్రహారిగోడ, కళ్యాణ మంటపం,బోర్ ఏర్పాటు చేసి నల్లాలు ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వస్తున్నారు.ఆలయం దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతుంది.

Advertisement

Latest Suryapet News