నల్గొండ జిల్లా:నల్లగొండ డీఆర్డీఏ ఆఫీసులో ఆపదమిత్ర వాలంటరీ శిక్షణ తరగతులు పూర్తి చేసుకొన్న యువకులు శివ, లక్ష్మణ్,సోహెల్,అశోక్,రాజ్ పాల్ మంగళవారం అనుముల మండలం హలియా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ను కలిశారు.స్వచ్ఛంద సేవ చేసేందుకు ముందుకు వచ్చిన తాము ప్రజాసేవకై కంకణ భద్రులై స్వయం సంకల్పంతో ముందుకు నడుస్తామన్నారు.
వీరికి హాలియా ఫైర్ స్టేషన్ ఎస్ఎఫ్ఓ ఎస్.వెంకటేశ్వర్లు, ఎల్ఎఫ్ఎం ఎల్లయ్య,కె.సురేష్, కె.గోవిందయ్య స్వాగతం పలికారు.