నటి షాలిని పాండే పై క్రిమినల్ కేసు నమోదు...!

అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతీ శేట్టి పాత్రలో నటించి  మనందరినీ ఎంతగా అలరించిన షాలిని పాండే అంటే మనందరికీ బాగా తెలుసు.అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగులో రాజ్ తరుణ్ సరసన ఇద్దరి లోకం ఒక్కటే అనే రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్  టెయినర్ చిత్రంలో నటించింది.

 Shalini Pandey Kollywood Tamil Producers-TeluguStop.com

అయితే ఇది ఇలా ఉండగా ఈ అమ్మడుపై తెలుగు, తమిళ ఫిలిం ఛాంబర్ లో క్రిమినల్ కేసు నమోదైనట్లు  సమాచారం.ఎందుకనగా తాజాగా ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోని సిరాగుగుల్ అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది.

అయితే ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు నవీన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా షాలినీ పాండే నెల రోజుల పాటూ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంది.

అయితే ఏమైందో తెలియదు కానీ రానురానూ  చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి షాలినీ ఇష్ట పడడంలేదట.
 

Telugu Arjunreddy, Criminal, Kollywood, Latesttelugu, Shalini Pandey, Tamilprodu

అంతేగాక చెప్పాపెట్టకుండా ఒక్కసారిగా  షూటింగ్ కి రావడమే మానేసింది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఒక సినిమా చేస్తానని చెప్పి షూటింగ్ లో కూడా పాల్గొని మధ్యలో ఇలా చేయడం సరికాదని అమ్మ క్రియేషన్స్ శివ  నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేశాడు.

అయినా ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో చివరికి చేసేదేమీ లేక తెలుగు, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసి షాలిని పాండేపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఉండగా ఈ అమ్మడుకి ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ సరసన నటించే అవకాశం వచ్చింది.

అందుకే షాలిని తమిళ సినీ పరిశ్రమను తక్కువ చూపు చూస్తోందని పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube