అమ్మాయిల రక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వీరికి సమాజంలో రక్షణ లభిస్తలేదని చెప్పవచ్చూ.నిత్యం స్త్రీల పై జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే అడవిలో మృగాలు అయినా నయం అనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ఒక బాలికపై మదం ఎక్కిన యువకుడు చేసిన అఘాయిత్యానికి ఆ ఊరి పెద్దల తీర్పు సమాజంలోని లోపాలను వేలెత్తేదిగా చూపిస్తుంది.యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణం తాలూకు వివరాలు చూస్తే.
సర్ధాన పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఉండే యువకుడు బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడట.ఇతను తన తన పొరుగున ఉండే బాలికతో స్నేహం చేసి మెల్లగా మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు.
ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడట.అలా ఆమె ఆరోగ్యం క్షిణించడంతో అసలు నిజాన్ని బయట పెట్టిందట.
కాగా ఈ వివాదం పంచాయితీకి చేరింది.ఈమేరకు పంచాయితీ పెద్దలు నిందితుడుని మూడేండ్లు గ్రామం విడిచివెళ్లాలని రూ రెండు లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారట.
అయితే ఈ ఉదంతం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలపడం ఆశ్చర్యం.ఇకపోతే ఒక స్త్రీ శీలానికి వెలకట్టే ఈ రోజులను చూసి సమాజం తలదించుకోవాలని అనుకుంటున్నారట.