ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం పరిశీలించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నేటి నుండి ఈ నెల 26వ వరకు జిల్లాకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించబడుతాయని, అభ్యర్థులకు కేటాయించిన తేదిల్లో అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ నందు సూచించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావల్సి వుంటుందని,జిల్లా పరిధిలో మొత్తం 5968 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలంచబడుతాయని, ఇందుకోసం మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని,నేటి ధృవ పత్రాల పరిశీలనకు 600 అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 507 మంది హాజరైనారని, ఇందులో అమ్మాయిలు 133 మంది,అబ్బాయిలు 374 మంది హాజరైనారని అన్నారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌక్యరానికి గురికాకుండా అలాగే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగంగా నిర్వహించాలని సూచించారు.అభ్యర్థులు సూచనలు పాటిస్తూ సమయానికి చేరుకోవాలని అన్నారు.

Scrutiny Of Certificates Of Police Candidates Commenced, Police Candidates, Cert

ప్రలోభాలకు గురికావద్దన్నారు.పరిశీలన స్థలం వద్ద సిబ్బంది అన్ని విధాల సహాయ సహకారం అందిస్తారని అన్నారు.

ఎస్పీ వెంట ఏఓ సురేష్ బాబు,డిఎస్పీ రవి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిఎస్ఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ,ఆర్ఐలు శ్రీనివాసరావు, గోవిందరావు,శ్రీనివాస్, నర్సింహారావు,సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, రాజ్ కుమార్,డిఓపి సిబ్బంది,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News