జూన్ 22 లోగా ఓటర్ జాబితా డోర్ టూ డోర్ వేరిఫికేషన్ పూర్తి చేయాలి: కలెక్టర్ వి.పి గౌతమ్

బూత్ లెవల్ అధికారులతో ఓటర్ జాబితా డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియ 22 జూన్ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.

 Door-to-door Verification Of Voter List Should Be Completed By June 22 Collector-TeluguStop.com

గౌతమ్ అన్నారు.బుధవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, సిడిపిఓ లతో ఎలక్టోరోల్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డోర్ టు డోర్ వెరిఫికేషన్ లో చనిపోయిన వారు ఓటరు జాబితాలో ఉంటే, తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.షిఫ్ట్ అయిన వారు ఉంటే ఫారం 7 సేకరించాలన్నారు.

ఆయా ఇంట్లో వచ్చే అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండువారు, ఇప్పటికే 18 సంవత్సరాలు నిండి, ఓటు హక్కు పొందని వారు ఉంటే ఫారం 6 సేకరించాలన్నారు.మొబైల్ నెంబరు తప్పనిసరిగా సేకరించాలన్నారు.

మార్పులకు ఫారం 8 సేకరించాలని కలెక్టర్ తెలిపారు.ఈ దిశగా బూత్ లెవల్ అధికారులకు అవగాహన కల్పించాలన్నారు.

ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో వున్న వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉండేదని, ఇప్పుడు దివ్యాoగులు, 80 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ఇవ్వనున్నారని ఆయన అన్నారు.

ఈ తరహా వారిని గుర్తించి, జాబితాలో మార్క్ చేయాలన్నా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డీఆర్డీఓ విద్యాచందన, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎస్డీసి దశరథం, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube