ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక ఇబ్బందులు...!

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేకపోవడంతో పాఠశాలలు మొత్తం అపరిశుభ్రంగా మారుతున్నాయని,కొన్ని చోట్ల మరుగుదొడ్లు క్లిన్ చేసేవారు లేక కంపు కొడుతుండడంతో విద్యార్దులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

గతంలో ప్రభుత్వ పాఠశాశాలల్లో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ ద్వారా స్కావేంజెర్స్ ను నియమించగా,కరోనా సమయంలో గత రాష్ట్ర ప్రభుత్వం వారిని తొలగించింది.

అప్పటి నుండి పాఠశాల పరిశుభ్రత బాధ్యత గ్రామపంచాయితీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు.కానీ,వారికే గ్రామంలో పనిభారం ఎక్కువ కావడంతో స్కూల్ వైపు వెళ్ళే పరిస్థితి లేదని అంటున్నారు.

Scavengers Or Trouble In Government Schools , Government Schools , Scavengers-�

కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, మరి కొన్నిచోట్ల పిల్లలచే బడులను శుభ్రం చేయిస్తున్నా విద్యా శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులను,విద్యార్థులను చదువుకు మాత్రమే పరిమితం చేసి,అన్ని పాఠశాలల్లో స్కావేంజెర్స్ నియమించి,పాఠశాలల విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News