కోతుల నుండి ప్రజలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పరిధిలోని అన్నీ వార్డులలో కోతుల బెడదను నివారించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిలర్ వినతిపత్రం అందజేశారు.

కోతులు నివాసాల్లోకి చేరి ప్రజలను గాయపరుస్తున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.

కోతుల బాధ తట్టుకోలేక పోతున్నామని,కోతులను పట్టించాలని కమిషనర్ కు సమస్యను వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కమదన చందర్రావు,స్థానిక ప్రజలు నవీన్, లచ్చయ్య,మదీనా,మీరా,ఈదుల కృష్ణయ్య,రామారావు, అంజయ్య,శ్రీనివాస్ రెడ్డి,నరేష్,తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News