యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను మీడియా లో వస్తున్న వార్తలు గందరగోళానికి గురి చేస్తున్నాయి.నిన్నకాక మొన్న కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా క్యాన్సల్ అయిందని.
బుచ్చి బాబు లేదా హను రాఘవపూడి దర్శకత్వం లో ఎన్టీఆర్ 30వ సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగింది.కొరటాల శివ స్క్రిప్ట్ రెడీ చేయడం లో విఫలమయ్యాడని, అందుకే ఎన్టీఆర్ ఇన్నాళ్లు వెయిట్ చేసి మరో దర్శకుడి తో సినిమా ను చేసేందుకు ఫిక్స్ అయ్యాడని.
డిసెంబర్ నెల లోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుందంటూ రకరకాల వార్తలు వచ్చాయి.దాంతో ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమా మారిందని అంతా అనుకుంటున్నారు.
ఈ సమయం లో మళ్లీ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కు జాన్వీ కపూర్ ఓకే చెప్పింది అంటూ ప్రచారం మొదలైంది.

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కోసం శ్రీదేవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ సినిమా తో ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుందని.కొరటాల శివ ఆమె ను ఒప్పించాడంటూ ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ లో ఆమె నటిస్తున్న సినిమా లు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వట్లేదు.దాంతో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్టీఆర్ సినిమా ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.
ఒక వైపు కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ ప్రచారం జరుగుతుండగా మరో వైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నా నేపథ్యం లో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.ఇంతకు అసలు విషయం ఏంటి అనేది ఆ కొరటాల శివ కానీ ఎన్టీఆర్ కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.