Satya Krishnan : సినిమా తప్ప ఇంకోటి లేదనుకునేవాళ్లు లొంగిపోతారు.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి సత్య కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్( Satya Krishnan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో అక్క వదిన పాత్రల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Satya Krishnan About Casting Couch-TeluguStop.com

ఆనంద్‌, బొమ్మ‌రిల్లు వంటి చిత్రాల‌తో తెలుగువారికి ద‌గ్గ‌రైంది.ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించిన ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలలో నటించడమే తగ్గించేసింది.

ఒకరకంగా చెప్పాలంటే సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉంటోందని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది నటి సత్య కృష్ణన్.

Telugu Anand, Bommarillu, Hyderabad, Satya Krishnan, Tollywood-Movie

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.మా అమ్మానాన్న ఇద్ద‌రూ బ్యాంకు ఉద్యోగులే.అమ్మ‌ది రాజ‌మండ్రి, నాన్న‌ది గుంటూరు.నేను పుట్టిపెరిగిందంతా హైద‌రాబాద్‌( Hyderabad )లోనే.నాన్న చనిపోయాక మా స్నేహితులు, నాన్న ఫ్రెండ్స్‌ ఎంతో స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డారు.ఆర్థికంగా కూడా సాయం చేశారు.

సినిమాల్లోకి అనుకోకుండా వ‌చ్చాను.నాకు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు.

ఇక ఆనంద్ సినిమాలో చేసిన‌టువంటి పాత్ర నాకు ఇంత‌వ‌ర‌కు మ‌ళ్లీ రాలేదు.బొమ్మ‌రిల్లు సినిమా హిట్ అయింది.

కానీ అందులో నా పాత్ర నిడివి ఎక్కువుంటే బాగుండు అనిపించింది.ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉండ‌టం అంటే అంత ఈజీ కాదు.https://telugustop.com/wp-content/uploads/2024/02/satya-krishnan-casting-couch-Anand-SOCIAL-MEDIA.jpg

Telugu Anand, Bommarillu, Hyderabad, Satya Krishnan, Tollywood-Movie

ఇన్నేళ్ల కెరీర్‌లో న‌న్ను ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు.అలా అని ఇండ‌స్ట్రీ అంటే కేక్ వాక్ కాదు.ప‌ని చేసేట‌ప్పుడు ఎవ‌రైనా ఏమైనా అంటే అవి ప‌ట్టించుకోవ‌ద్దు.విసుక్కోవ‌డం, తిట్ట‌డం, ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణం.నేను మీతో ఎలా ఉన్నానో.మీరు నాతో అలా ఉండంటి అని చెప్తూ ఉంటాను అని తెలిపింది సత్య.

అనంతరం క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ.క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) విష‌యానికి వ‌స్తే ఇది ప్ర‌తిచోటా ఉంది.

స‌ముద్రంలో నీటితో పాటు ఉప్పు కూడా ఉంటుంది.ఇదీ అలాగే.

నాకైతే అలాంటి అనుభ‌వం ఎదుర‌వ‌లేదు.ఎవ‌రైనా అలాంటి వైబ్స్ ఇచ్చినా నా లైన్‌లోకి రానివ్వ‌ను.

ప్ర‌పంచంలో ఎక్కువ‌ అందంగా ఉండేది అమ్మాయిలే క‌దా, అందుకే ఆడ‌వాళ్లే ఇలాంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌ ఎదుర్కొంటున్నారు.మ‌నం ఎలా ఉన్నాం, మ‌న‌ల్ని మ‌నం ఎలా కాపాడుకున్నామ‌నేదే ముఖ్యం.

ఎవ‌రైనా అతి చేస్తున్న‌ట్లు అనిపిస్తే నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని ధైర్యంగా చెప్ప‌గ‌ల‌గాలి.ఇలా చెప్తే మ‌న‌కు పాత్ర‌లు ఇవ్వరేమో అని కెరీర్ గురించి భ‌య‌పెడటం కరెక్ట్ కాదు.

ఇది త‌ప్ప ఇంకో ఛాన్స్ లేద‌నుకునేవాళ్లు ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు.ఈ మాట‌లు చెప్ప‌డం ఈజీనే కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎంత న‌ర‌కం చూసుంటారో ఊహించలేం.

ఏదేమైనా సరే మాతో వ‌ర్క‌వుట్ కాద‌ని ధైర్యంగా చెప్ప‌గల‌గాలి అని చెప్పుకొచ్చింది స‌త్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube