ఎస్సీల భూములను ఆక్రమించుకుంటున్న సర్పంచ్...!

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చందంపేట మండలం గాగిళ్ళాపురం గ్రామంలో ఎస్సీ కుటుంబానికి చెందిన భూమిలో గ్రామ సర్పంచ్ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలుసుకున్నబహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు రామవత్ రమేష్ నాయక్ గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గాగిళ్ళాపురం గ్రామానికి చెందిన దళితులు మాసారం చిన్న మల్లయ్య తండ్రి సాయిలు మరియు లాలయ్య తండ్రి సత్తయ్యలకు 1992లో నాటి ప్రభుత్వం కేటాయించిన 121 గజల భూమిని గ్రామ సర్పంచ్ తన అనుచరులతో ఆక్రమించి,భూమిలో నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించడం జరిగిందన్నారు.

ఈ భూమి ఎవరికైతే కేటాయించబడ్డతో వారి వారసులు అడ్డుకున్నారని, సర్పంచ్ తన పరపతిని వినియోగించి చందంపేట ఎస్ఐని పిలిపించుకొని, బాధితుల మీద దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఎస్ఐ వాస్తవాలను విచారణ చేయకుండా సర్పంచ్ కు వత్తాసు పలుకుతూ ఆ భూమిలో నిర్మాణం చేసుకోమని చెప్పడం దారుణమని అన్నారు.

Sarpanch Is Encroaching On SC Lands , SC Lands, Sarpanch-ఎస్సీల భ�

సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఆయనకు సహకరించలేదనే నెపంతో కక్షగట్టిన సర్పంచ్, దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని,సర్పంచ్ ఆయనకు వత్తాసు పలుకుతున్న ఎస్ఐపై చర్యలు తీసుకొని,ఆ భూమి చిన్న మల్లయ్యకు, లాలయ్యకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సైదులు, అంజి,తరుణ్ చారి,దత్తు నాయక్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News