ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన సంకినేని

సూర్యాపేట జిల్లా:ఆత్మకూరు(ఎస్) మండలంలోని రామోజీ తండా గ్రామంలోని పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు( Sankineni Venkateswara Rao ) సందర్శించి పరిశీలించారు.

రైతుల సమస్యలను( Formers ) అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కొంతమంది రైతులు తమ ధాన్యం కాంటా వేసిన కూడా ఇప్పటివరకు కొనుగోలు పత్రాలు,ట్రక్ షీట్లు ఇవ్వడం లేదంటూ చెప్పడంతో వెంటనే స్థానిక ఎమ్మార్వోకు ఫోన్ చేసి రైతుల సమస్యలను ఎమ్మార్వోకు వివరించి ధాన్యం కాంటా వేసిన రైతులకు కొనుగోలు పత్రాలు,ట్రక్ షీట్స్ ఇచ్చేలా చూడాలని చెప్పారు.

Latest Suryapet News