మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంకినేని

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా దోచుకుని,దాచుకున్న అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల తరహాలో ఓటుకు రూ.

10,000 పంచడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు.ఇదే విషయాన్ని పార్టీ నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం ఉందని,వచ్చే ఎన్నికల్లో మనం తప్పకుండా గెలుస్తామని చెబుతున్నారని,దీని అర్థం ఓటుకు నోటు పెట్టడడమేనని అన్నారు.

Sankineni Made Sensational Remarks On The Minister-మంత్రిపై స�

అవినీతిని పెంచి పోషించి అడ్డదారిలో గద్దెనెక్కేందుకు మంత్రి చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News