ఆసక్తి రేపుతున్న సైదిరెడ్డి ఎంపీ అభ్యర్థిత్వం...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ),అసెంబ్లీ రౌడీగా చెలామణి అవుతూ భూ దందాలకు పాల్పడుతూ మఠంపల్లి మండలం గుర్రంబోడ్ తండా గిరిజనుల భూములను కూడా కబ్జా చేశారనే ఆరోపణలపై 2021లో బీజేపీ గిరిజనభరోసా యాత్ర పేరుతో ఆ భూముల పైకి దండయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో బీజేపీ నేతలపై రాళ్ల దాడి చేయించి,అక్రమ కేసులు పెట్టించి,జైలుకు పంపారని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమిపాలై,ఎమ్మేల్యేగా ప్రజలు తిరస్కరించడంతో సైదిరెడ్డి పొలిటికల్ సీన్ రివర్స్ అయ్యింది.తన అవినీతి, అక్రమాలను కాపాడుకునే ప్రయత్నంలో ఏ పార్టీ మీద రౌడిజం చేసి,అక్రమ కేసులతో జైలుకు పంపారో అదే పార్టీలోకి చేరిపోయారు.

Saidireddy's MP Candidature Is Causing Interest...!-ఆసక్తి ర�

అంతేకాదుఏకంగా నల్లగొండ ఎంపీ సీటు కూడా కొట్టేశాడు.కానీ, నల్లగొండ బీజేపీ శ్రేణుల నుండి సైదిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది.

తమపై దాడి చేపించి తమను జైలుకు పంపిన వ్యక్తికి ఓటేసి తమ భుజాలపై మోసే ప్రసక్తేలేదని తిరుగుబాటు రాగం అందుకున్నారు.మాజీ పార్టీ నేతలు కూడా సైదిరెడ్డి చర్యపై గరంగరంగా ఉన్నారు.

Advertisement

పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన మాజీ ఎమ్మెల్యే వాయిస్ రికార్డ్ తో గులాబీ క్యాడర్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.ఈ తరుణంలో అటు మాజీ పార్టీ, ఇటు తాజా పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గ్రహించి బీజేపీ అధిష్టానం నల్లగొండ బీజేపీ అభ్యర్దిని మార్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది.

అంతా తారుమారు అయ్యేటట్లు ఉందని భావించిన సైదిరెడ్డి దిద్దుబాటు చర్యల్లో భాగంగా రాష్ట్ర బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని నల్లగొండ బీజేపీ( Nalgonda BJP ) క్యాడర్ ను చల్లబరిచే ప్రయత్నాలు చేశారు.కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ నేతలు సైదిరెడ్డిని ససేమిరా ఒప్పుకునేది లేదని పార్టీపై ఒత్తిడి తెస్తున్నట్లు, అవసరమైతే బీఆర్ఎస్ రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి( Tera Chinnapa Reddy ) టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే చిన్నపరెడ్డి మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దల టచ్ లోకి వెళ్లారని సమాచారం.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నల్లగొండ బీజేపీ అభ్యర్ధిగా సైదిరెడ్డే కొనసాగక తప్పదనే వాదన వినిపిస్తోంది.

అదే నిజమైతే నల్లగొండ బీజేపీ క్యాడర్ పార్టీ పెద్దల నిర్ణయంతో సర్దుకుపోయి ఆయనను గెలిపిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇదిలా ఉండగా తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో బీజేపీ క్యాడర్ పరిస్థితి విచిత్రంగా ఉంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

అభ్యర్థిగా సైదిరెడ్డిని అంగీకరించలేకపోయినా,పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదంటూ మాట దాట వేస్తున్నారు.ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న చల్లా శ్రీలత రెడ్డి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేశారు.

Advertisement

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీలత రెడ్డి సైదిరెడ్డిల మధ్య వివాదం తలెత్తి ఆమె పార్టీకి,పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆయనపైనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు.ప్రస్తుతం ఆమె సైదిరెడ్డితో కలిసి ఎంపి ఎన్నికల్లో పనిచేస్తారా?లేక సైదిరెడ్డి చేసిన నమ్మకద్రోహమే చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తుంది.ఏది ఏమైనా గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని చేసిన అవినీతి అక్రమాలు ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Latest Nalgonda News