ప్రతి శనివారం సాగర్-శ్రీశైలం లాంచీ టూరు...ఇక పర్యాటకులకు పండుగే

నల్లగొండ జిల్లా:జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న నాగార్జునసాగ‌ర్ జలాశయం నుండి శ్రీశైలం వరకు తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి శాఖ మరియు నందికొండ హిల్ కాల‌నీ లాంచ్ స్టేష‌న్ వారి సౌజన్యంతో పర్యాటకుల సౌకర్యార్థం ప్రతి శనివారం లాంచీ ప్రయాణం ఏర్పాటు చేశారు.

మూడు రోజుల క్రితం ఈ లాంచీని నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ తిరుమల కొండ అన్నపూర్ణ జెండా ఊపి లంచీని ప్రారంభించారు.

తొలిరోజు లాంచీలో ప్ర‌యాణికులు శ్రీశైలం దేవ‌స్థానాని బ‌య‌ల్దేరగా కృష్ణాన‌దిలో ఆరు గంట‌ల పాటు ప్ర‌యాణం కొన‌సాగి సాయంత్రానికి శ్రీశైలం చేరుకొని రాత్రి అక్కడే బస చేసి తెల్లారి శ్రీశైల మల్లికార్జునస్వామిని, ఇతర ఆలయాలను దర్శించుకొని ఆదివారం సాయంత్రానికి సాగర్ చేరుకోవడంతో ఈ లాంచీ ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశారు.లాంచీ ప్రయాణం విజయవంతం కావడంతో తెలంగాణ పర్యాటక శాఖ మరింత జోష్ తో ఈ ప్రయాణాన్ని కొనసాగించనుంది.

ఇక నుండి ప్రతి శనివారం సందర్శకులకు పండుగ వాతావరణమే.కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి.

గౌతమ బుద్ధుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంలోకి పోగానే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది.ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు,కొండలు,జలపాతాలు,మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడముచ్చటైన అందాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి.

Advertisement

సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది.భవానీ ద్వీపం సొగసులు చూస్తూ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు ప్రత్యక్షంగా అందాలను ఆస్వాదిస్తూనే ఉండొచ్చు.

అడుగడుగనా ప్రకృతి అందం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది.అలాంటి మధురానుభూతిని పొందాలి అనుకుననే వారికి నవంబర్ 2 నుంచి తెలంగాణ పర్యాటక శాఖ అవకాశం కల్పిస్తోంది.

దీనితో కృష్ణమ్మ తీరంలో పర్యాటకం సందడిగా మారబోతోంది.కృష్ణమ్మ అలలు,భవానీ ద్వీపం అందాలు ఒకటా రెండా అడుగడుగునా పర్యాటక ప్రాంతాలే దర్శనమిస్తాయి.

ప్రకృతి అందాలే కాదు, ఆధ్యాత్మిక భావనలు కూడా మదిని హాయిగా ఉండేలా చేస్తుంది.అందుకే తెలుగు ప్రజలే కాదు దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులు సైతం ఈ టూర్ కు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?
మినీ ట్యాంక్ బండ్ పై వెలగని సోలార్ స్ట్రీట్ లైట్స్

ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం దాదాపు 590 అడుగులు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది.తక్కువ ఖర్చుతో,తక్కువ సమయంలో సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.

Advertisement

ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే లాంచీ ప్రయాణం హాయినిస్తూ ఈ ప్రయాణం మరవలేని మధుర స్మృతులను అందించనుంది.పక్షుల కిలకిలరావాలు,నీటి సవ్వడుల మధ్య సాగే ఈ లాంచీ జర్నీ ఆధ్యంతం ఆసక్తిగా సాగుతూ కొండల మధ్య తిరుగుతూ మనకు తెలియని కొత్త,వింతైన విషయాలను తెలుసుకునేందుకు దోహదపడుతుంది.

ఈ పర్యటను ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో విహార యాత్రికులతో కృష్ణానదీ తీరం మళ్లీ కళకళలాడబోతుంది.శనివారం ఉదయం సాగర్ నుండి బయలుదేరి సాయంత్రం శ్రీశైలం చేరుకొని,ఆ రాత్రి అక్కడే బస చేసి,దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మరుసటి రోజు ఉదయం శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమై సాయంత్రం 5 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుంది.

కృష్ణమ్మ పరవళ్లలో ప్రయాణిస్తూ నల్లమల అటవీ అందాలను వీక్షించాలని అనుకునే వారికి ఇదే సరైన సమయం.చుట్టూ ప్రకృతి అందాలతో అలరారే పచ్చదనంతో కప్పేసిన ఎత్తయిన కొండల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో అలరించనుంది.

సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు 120 కిలో మీటర్ల దూరం లాంచీలో ఏడు గంటల పాటు ప్రయాణం పర్యాటకులను కనువిందు చేయడం ఖాయమని పర్యాటక శాఖ ఆహ్వానిస్తుంది.

Latest Suryapet News